విద్యార్థులు నేటిసమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలి
తణుకు పట్టణంలోని శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్.ఎన్.వి.టి.లో సోమవారం నిర్వహించిన వీడ్కోలు సభ ఉత్సాహభరితంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కష్టపడి సాధించాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించగలరని ఆమె పేర్కొన్నారు. నేటిసమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. […]










