తణుకు జాతీయ లోక్ అదాలత్ లో  మొత్తం 1177 కేసులు రాజీ

శనివారం తణుకు కోర్టు భవనముల సముదాయములో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ యందు తణుకు లీగల్ సర్వీసెస్ చైర్మన్, నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సుంకర శ్రీదేవి ఆధ్వర్యములో జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 1177 కేసులు రాజీచేశారు, రాజీ అయిన వాటిలో మోటార్ వాహనాల ప్రమాద బీమా కేసులలో 11 కేసులకు గాను 46,15,000 రూపాయలు కక్షిదారులకు పరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీ వారి నుంచి ఇప్పించారు, అన్ని రకాల సివిల్ కేసులు మొత్తం 10 కేసులు రాజీ చేసి రూపాయలు 22, 38,000/- చెక్ బౌన్స్ కేసులు 07 లో రూపాయలు 5,92,250/-  మిగతా క్రిమినల్ కేసులు 236, బెంచ్ కోర్టు న్యూసెన్స్ (పెట్టి) 903 కేసులు, BSNL టెలిఫోన్ బకాయి కేసులు 10 రాజీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ లోక్ అదాలత్ లో కేసులు రాజీచేసుకొనుట వల్ల విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సుంకర శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణసత్య లత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర్.ఆశీర్వాదం పాల్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. స్వర్ణ, రెండవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శ్రీమతి కె. కృష్ణవేణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్  కాంతి ప్రసాద్, సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు, పోలీస్ స్టేషన్ అధికారులు కక్షిదారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link