ఆధ్యాత్మికం

శ్రీ దానేశ్వరి అమ్మవారికి 1లక్ష 116 రూపాయలు విరాళం

దువ్వ గ్రామములో వేంచేసిన శ్రీ దానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ పునర్నిర్మాణం కొరకు ముళ్ళపూడి నారాయణరావు ఆలయ అభివృద్ధి కొరకు ఒక లక్ష 116రూపాయలును ఆలయ ఛైర్మెన్ ప్రత్తి రామకృష్ణకి అందచేశారు. అనంతరం దువ్వ గ్రామంలో తాపీ మేస్త్రి బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సంఘ భవన అభివృద్ధి కొరకు 50వేల రూపాయలను యూనియన్ చైర్మెన్ జానపాముల శ్రీనుకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గసభ్యులు, గ్రామ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

శివ ముక్కోటి సందర్భంగా పాలంగి రామేశ్వరాలయంలో అన్నాభిషేకం

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం శివముక్కోటి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు అన్నాభిషేకం నిర్వహించినట్లు అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించినట్లు ఈవో రామయ్య తెలియజేశారు.

ఆధ్యాత్మికం

గోకర్ణేశ్వరుని ఆలయంలో శివముక్కోటి కి ప్రత్యేక అభిషేకాలు

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న బ్రహ్మసూత్ర ప్రతిష్ట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం శివ ముక్కోటి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం, శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించినట్లు అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలియజేశారు.ఈ సందర్భంగా భారీ సంఖ్యలో శనివారం ఉదయం నుండి భక్తులు

ఆధ్యాత్మికం

ఉండ్రాజవరంలో అయ్యప్పస్వాముల అఖండ అన్నసమారాధన

ఉండ్రాజవరం గ్రామంలో అఖిలభారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని అయ్యప్ప దీక్షదారులు గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అఖండ అన్న సమారాధన కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష పీఠం గురుస్వామి చక్రవర్తుల లక్ష్మణాచార్యులు (రాజా స్వామీ) ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ అన్న సమారాధన కార్యక్రమం ఉదయం 12 గంటల నుండి ప్రారంభమై మూడు గంటల వరకు నిర్విరామంగా సాగింది. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి

ఆధ్యాత్మికం

ఉండ్రాజవరంలో నందీశ్వరునికి త్రయోదశి పూజలు

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతినెల బహుళ త్రయోదశి రోజున జరిగే శ్రీ నందీశ్వర స్వామివారికి అభిషేకం శనివారం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీ నందీశ్వరుల వారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన అర్చకులు మద్దిరాల వెంకటరమణ, ఆకెళ్ళ శ్రీనివాస్ లచే నిర్వహించబడింది, ఈ పూజా కార్యక్రమంలో భారీగా మహిళా భక్తులు పాల్గొని

ఆధ్యాత్మికం

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలో వేంచేసియున్న పలు అమ్మవారి దేవాలయాలను సోమవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తణుకు మండలంలోని వేల్పూరు గ్రామంలో వేంచేసిన ఈశ్వరమ్మ, మండపాక యల్లారమ్మ, తణుకు ముత్యాలమ్మ తల్లి దేవాలయంతో పాటు దువ్వ గ్రామంలోని దానమ్మ అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులకు ఘనస్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు.

ఆధ్యాత్మికం

బాలత్రిపురసుందరి అమ్మవారికి వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలు

మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో కోరినకొర్కెలు నెరవేర్చే తల్లి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి వైశాఖ మాసం పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి పంచామృతాలతో వివిధ పళ్ళరసాలతో అభిషేకం సహస్ర నామ కుంకుమార్చనలు జరిగాయి. అనంతరం మహిళా బక్తులు లలితాపారాయణ గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతీ పౌర్ణమికీ విశేష అలంకారములతో

ఆధ్యాత్మికం

తణుకులో ఘనంగా తాళ్ళపాక అన్నమాచార్యులు జయంతి

ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు జయంతి సందర్భంగా వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిడిపి నాయకురాలు వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్డున వున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న అన్నమాచార్యల విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య అని 35 వేల కీర్తనలు రచించి పాడిన గొప్ప కీర్తనాచార్యులని, గొప్ప సంఘసంస్కర్త, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరునిపై పాడిన‌ పాటల ద్వారా ఆయనను

ఆధ్యాత్మికం

కొండాలమ్మ – పల్లాలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న రేణుక దంపతులు

వైశాఖ బుద్ధపౌర్ణమి పర్వదినమున తణుకు పట్టణం (పాతూరు) ఇలవేల్పు శ్రీ కొండాలమ్మ , పల్లాలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవ సందర్భముగా డా.ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ (హరిబాబు) అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు, నూతన వస్త్రములు సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి, పహల్గమ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని, పాక్ ముష్కరులను మట్టుపెట్టే శక్తి, మనోధైర్యం భారత సైనికులకు ప్రసాదించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కొండాలమ్మ ,

Scroll to Top