తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతినెల బహుళ త్రయోదశి రోజున జరిగే శ్రీ నందీశ్వర స్వామివారికి అభిషేకం శనివారం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీ నందీశ్వరుల వారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన అర్చకులు మద్దిరాల వెంకటరమణ, ఆకెళ్ళ శ్రీనివాస్ లచే నిర్వహించబడింది, ఈ పూజా కార్యక్రమంలో భారీగా మహిళా భక్తులు పాల్గొని స్వామివారి అభిషేకాన్ని తిలకించారు.




