ఉభయ తెలుగు రాష్ట్రాలలో బౌద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో గల బౌద్ధ దమ్మపీఠం యందు మైత్రేయ బుద్ధవిహారలో నిర్మితమవుతున్న బౌద్ధ ఆలయం కలస ప్రతిష్టాపన మహోత్సవం జనవరి 25 ఆదివారం జరగనున్న సందర్భంగా శుక్రవారం పీఠాధిపతి బంతే అనాలియో పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న బౌద్ధాలయంలో ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, నిడదవోలు నియోజకవర్గం టిడిపి నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కలశ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుండి ఉండ్రాజవరం బుద్ధ విహార వరకు కలశముల రథంతో 130 మీటర్ల బౌద్ధ పతాకంతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి, విశిష్ట అతిథిగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ప్రత్యేక ఆహ్వానితులుగా శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ ఉండ్రాజవరం మాజీ ఎంపీటీసీ బూరుగుపల్లి సుబ్బారావు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ బౌద్ధ ఉపాసకులు, పూజ బుద్ధ పాల బంతేజీ, మహాబోధి విహార సికింద్రాబాద్, గుజరాత్ నుండి పూజ్య సారిపుత్త బంతేజి, పూజ్య సంఘపాల బంతేజీ, పూజ్య సిద్ధార్థ బంతేజి, పూజ్య సద్దారక్ కిత బంతేజీ ధర్మపద బుద్ధవిహార హైదరాబాదు నుండి వస్తుండగా 8 మంది పూజ్య శ్రమణేరులు విచ్చేస్తున్నారని అన్నారు. ఈ మహోన్నత కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుండి బౌద్ధ సాధకులు వస్తున్నారని పీఠాధిపతి బంతే అనాలియో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలశస్థాపన కార్యక్రమం కొరకు ప్రత్యేకంగా తయారుచేసిన రెండు గీతాలను విడుదల చేశారు. భక్తులు కలశ దర్శన అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బావన ప్రసాద్, ఎస్.శ్రీధర్, నెక్ చైర్మన్ మల్లిన శ్రీనివాస్, బూరుగుపల్లి కళారావు, తాడిపర్రు గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు, తూ.గో. జిల్లా బిజెపి నాయకులు అక్కిన గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




