అపార మేధాశక్తి మన భారతీయుల సొంతం

అపార మేధాశక్తి మన భారతీయుల సొంతం అనడానికి ఈమె జీవితం ఒక ఉదాహరణ. బెంగుళూరు నగరంలో కన్నడ పూజారి కుటుంబంలో 1929 లో జన్మించిన శకుంతులాదేవి. ఆమె తండ్రి పూజారిగా ఉండడానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసములు చేయుటకు నియమింపబడ్డాడు. మూడేళ్ల వయసులోనే శకుంతలాదేవి పేకలతో ట్రిక్కులు చేయడంలో ప్రతిభని ఆమె తండ్రి గమనించాడు. ఆమెని చదివించాలి అనుకుని ఒకటో తరగతిలో జాయిన్ చేసారు. కాని పేదరికం కారణంగా ఒకటో తరగతి మద్యలోనే ఆమె చదువు మానేశారు. తరువాత శకుంతలాదేవి జ్యోతిష్యం మీద మక్కువ చూపించింది. జ్యోతిష్యం అంటే మూఢనమ్మకం అని చెప్పే నాస్తికులు & ఇతర మతస్ధులకి తెలియదు దానిలోని గొప్పతనం. దానిలో ఉండే గణితాన్ని పరిష్కరించడం అత్యంత క్లిష్టతరం. అటువంటి జ్యోతిష్యం మీద శకుంతలా దేవి మక్కువ చూపడం వల్లే ఆమె హ్యుమన్ కంప్యూటర్ అనే బిరుదు దక్కుంచుకొగల్గింది.కంప్యూటర్ కన్నా స్పీడ్ గా లెక్కలు చేయగల్గింది.అమెరికాలో 1977 లో శకుంతలా దేవికి ఒక కంప్యూటర్ తో పోటి పెట్టారు.1888132517 × 18888132517×18888132517 ఎంత అని పోటి పెట్టక ఆమె కంప్యూటర్ ని ఓడించేసారు. 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు.76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలాదేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

గత శతాబ్దిలో ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీన ఏ వారం వచ్చిందో.. నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్పే మేధస్సు ఆమె సొంతం. ఆమె ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు. తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

*వైద్యం & గణితం & ఖగోళం ప్రతి రంగం మీద మన భారతీయ ఋషులు ఎన్నో గొప్ప శాస్త్రాలని మనకి అందించారు. ఈ ప్రపంచం ఇలా ఉందంటే దానికి కారణం మన భారతీయ ఋషులే. ఇక్కడ విజ్ఞానమే ప్రపంచానికి అందింది.

Scroll to Top
Share via
Copy link