ప్రకృతి వ్యవసాయ పద్దతులే భూసారాన్ని పెంచుతాయి

క్ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంపై ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని తాడిపరు గ్రామంలో తణుకు ఏడిఏ జి. నరేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేల ఆరోగ్యం నేల సంరక్షణ అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి భూసార పరీక్ష ఫలితాల ప్రకారంగా సేంద్రీయ మరియు రసాయన ఎరువులను వినియోగించడం వల్ల అనగా పశువుల ఎరువు వర్మి కంపోస్టు, పచ్చరొట్ట ఫైర్లు, నవధాన్యాలు వంటి సేంద్రియ పదార్థాలను నేలకు అందజేయడం వల్ల మేలు చేసే సూక్ష్మజీవుల సంతతి పెరగడంతో పాటు రసాయనక ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, మిత్ర పురుగుల సంరక్షణ నేలకు నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతుందని తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి యాజమాన్యం పై ప్రత్యేక దృష్టిని సారించాలని ఒకవేళ పైరు బేట్టకు గురి అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు నానో యూరియా, నానో డి ఏ పి లను వాడటం వల్ల పంటను సంరక్షించుకోవచ్చని తెలిపారు.మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ బోర్లు కింద వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలని దినికి ప్రభుత్వం రాయితీస్తుందని తెలిపారు.ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మన జిల్లాకు వరి, మినుము మరియు అరటి పంటలకు పంటల భీమా చెల్లించుకోవాలని, దిగుబడి ఆధారితంగా వరి, మినుము పంటలకు మరియు వాతావరణ ఆధారిత పంటల భీమాకు అరటిని ఎంపిక చేసినట్లు తెలిపారు పంటల భీమా చెల్లించుటకు వరి పంటకు ఆగస్టు 15 వరకు అరటికీ జూలై 31వ తేదీ లోపు చెల్లించాలని ఇతర వివరాల కొరకు సంబంధిత రైతు సేవ కేంద్రం ను సంప్రదించాలని తెలిపారు. APAIMS యాప్ ద్వారా యూరియా మరియు డిఏపి ఎరువుల పంపిణీ నిర్వహిస్తున్నట్లుగా దీని ద్వారా ఇవ్వడం వల్ల రైతుకు వారు సాగుచేసే పంటను బట్టి దఫ దఫాలుగా ఎరువులను ఇస్తున్నట్లు ఈ విధానంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత రైతు సేవ కేంద్రం ను సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తాడిపర్రు సొసైటీ అధ్యక్షులు దుర్గా బాలకృష్ణ, ఎక్స్ సర్పంచ్ కరుటూరి నరేంద్ర, రైతులు, గ్రామ నాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link