అత్యంత వైభవంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణం

మహిమాన్విత వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా ఆదివారం తణుకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నందు అత్యంత వైభవంగా ఆలయపురోహితులు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి వారిని పురవీధుల్లో గ్రామోత్సవం జరిపి అనంతరం కళ్యాణ వేదికవద్ద కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్, ఉమ్మడి ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా స్వర్ణకార సంఘ కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, తణుకు పట్టణ స్వర్ణకారసంఘ అధ్యక్షుడు నాగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సుబ్బారావు, కోశాధికారి వెండి శ్రీను, ఆలయ ధర్మకర్తలు పేరూరి మోహన్, తమిరి శివ, డి.సుబ్బారావు, ఎస్. చిన్న తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link