మహాశివరాత్రికి మోర్త శ్రీ పార్వతీ సమేత గౌరీశ్వర స్వామికి విశేషపూజలు

ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత గౌరీశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం బిల్వర్చనలు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి మహా పర్వదిన సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమం 3000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ గౌరీశ్వర స్వామి వారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ తనయులు డా.కృష్ణ తేజ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link