తూర్పుగోదావరిజిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో శ్రీ చంద్రశేఖర సేవాసమితి వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వరస్వామి వారికి శివరాత్రి లింగోద్భవకాలంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమపూజ, బిల్వపత్ర పూజలు జరిగినవి. ఈకార్యక్రమంలో ఆకెళ్ళ శ్రీనివాసరావు దోనేపూడి సుధాకర్. ఏలూరిపాటి సత్యకృష్ణ, కూచిభొట్ల సత్యనారాయణ, దోనేపూడి శ్రీరామ్ పవన్, కోడూరి సుబ్రమణ్యం, సి.హెచ్.బాలాజీ, మల్లాది రమణ వేద మంత్రాచరణతో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు స్వామి వారి అభిషేకం చూసి తీర్థప్రసాదాలు స్వీకరించినారు.


