పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఖండ పరిధిలోని గణపవరం మండలం వాకపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామ స్వామి వారి సన్నిధిలో శుక్రవారం గ్రామ వికాస్ ఆధ్వర్యంలో గోపూజ, భూమి సుపోషణ కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి గ్రామ వికాస్ గోదావరి విభాగ్ సంయోజక్ చింతాకుల గోపాలకృష్ణ, ఖండ సహ సంయోజక్ సాధనాల శ్రీనివాస్, వాకపల్లి కమిటీ సభ్యుడు నండూరి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాల్గొన్న డాక్టర్ ముళ్ళపూడి రేణుక గోపూజ-భూమి సుపోషణ కార్యక్రమంలో గోమాత విశిష్టత, అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
అనంతరం శ్రీ కోదండరామ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి,రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ధర్మం, గ్రామ అభివృద్ధి, ప్రకృతి సంరక్షణ అనే లక్ష్యాలతో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి భావంతో, భవ్యంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




