రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపద్యంలో తణుకు పట్టణంలోని జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్లో పదవ తరగతి బోర్డు పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులను బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక శుక్రవారం కలుసుకుని వారికి ధైర్యం, ప్రోత్సాహం అందజేసినారు. విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు” అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో , ప్రశాంతమైన మనసుతో పరీక్షలు ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, కష్టపడి చదవడం, గురువు మార్గదర్శనం విజయానికి పునాది అని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని సూచనలు కూడా తెలియజేశారు.
విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారం ఎంతో అమూల్యమని ఆమె అభినందించారు. ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి తమ కుటుంబానికి, పాఠశాల, సమాజానికి గర్వకారణం కావాలని
విద్య ద్వారా సమాజం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి నేటి విద్యార్థులు రేపటి శక్తిగా నిలవాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.




