ఆత్మీయ ఆహ్వానం పలికిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు కొండేపాటి సరోజనిదేవి మహిళా కళాశాల విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీను సందర్శించారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణత ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాసనసభను సందర్శించిన విద్యార్థులు అధికారులు, అధ్యాపకుల ద్వారా సభ విశిష్టతను, ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని తెలుసుకున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి పర్యటన చేయడం ద్వారా విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ప్రజాస్వామ్యంపై అవగాహన ఏర్పడుతుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


