పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలకు ప్రేరణగా నిర్వహిస్తున్న “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్” కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణ బిజెపి అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు అధ్యక్షతన తణుకు పట్టణంలో తాపీమేస్త్రి సంఘ భవనంలో జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతాలు సమాజంలో చిట్టచివరి వ్యక్తి వరకు పార్టీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలు అందాలనే లక్ష్యంతో సేవ చేయాలని పేర్కొన్నారు. అదేవిదంగా బిజెపి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి,. సమాజ సేవే లక్ష్యంగా, పార్టీ బలోపేతమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, దత్తు ప్రసాద్, తణుకు టౌన్ ఇంచార్జ్ ఈతకోట భీమశంకరరావు (తాతాజీ), జిల్లా మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


