మహిళలనే సమాజానికి బలం

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మహిళల హక్కు

మహిళ ఆరోగ్యంతోనే సమాజం అభివృద్ధి

ప్రముఖ ఐటీ కన్సల్టెంట్‌ ఆరిమిల్లి కృష్ణతులసి

ప్రతి కుటుంబానికి ఆధారమైన మహిళలు సమాజానికి బలంగా నిలుస్తున్నారని ప్రముఖ ఐటీ కన్సల్టెంట్, ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణతులసి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆమె మీడియాను ఉద్దేశించి మట్లాడారు. మహిళల శక్తిని, వారి సేవలను గౌరవంగా స్మరించుకునే విధంగా ప్రతి రంగంలో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తూ మన సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్‌ ‘ప్రతి మహిళలకు హక్కులు, సమాన అవకాశాలు మరియు గౌరవం లభించాలి’ అనే నినాదంతో సందేశాన్ని ఇస్తోందన్నారు. మహిళల ఆరోగ్యం చాలా ముఖ్యమైనదనీ, చాలా సార్లు మహిళలు కుటుంబం కోసం అన్నీ చూసుకుంటారనీ అయితే తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్న మహిళే కుటుంబాన్ని, సమాజాన్ని బలంగా నిలబెట్టగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. సమయానికి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అవసరమైనప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని చెప్పారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా మహిళల హక్కులలో ఒక ముఖ్యమైన భాగమని ఆమె పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా, ధైర్యంగా ముందుకు సాగితే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ హృయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలను ఆరిమిల్లి కృష్ణతులసి తెలిపారు.

Scroll to Top
Share via
Copy link