దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలో వేంచేసియున్న పలు అమ్మవారి దేవాలయాలను సోమవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తణుకు మండలంలోని వేల్పూరు గ్రామంలో వేంచేసిన ఈశ్వరమ్మ, మండపాక యల్లారమ్మ, తణుకు ముత్యాలమ్మ తల్లి దేవాలయంతో పాటు దువ్వ గ్రామంలోని దానమ్మ అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులకు ఘనస్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు.




