ఉండ్రాజవరంలో అయ్యప్పస్వాముల అఖండ అన్నసమారాధన

ఉండ్రాజవరం గ్రామంలో అఖిలభారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని అయ్యప్ప దీక్షదారులు గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అఖండ అన్న సమారాధన కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష పీఠం గురుస్వామి చక్రవర్తుల లక్ష్మణాచార్యులు (రాజా స్వామీ) ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ అన్న సమారాధన కార్యక్రమం ఉదయం 12 గంటల నుండి ప్రారంభమై మూడు గంటల వరకు నిర్విరామంగా సాగింది. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.

Scroll to Top
Share via
Copy link