ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన బడ్జెట్లపై రాష్ట్ర బిజేపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక సొమవారం తణుకు క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం వలన అభివృద్ధి అనేది ఎవిధంగా ఉంటుంది అనేది ఈ బడ్జెట్లను బట్టి అంతర్జాతీయ, జాతీయ, పరిస్థితులు ట్రేడ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో గేం చేంజర్ బడ్జెట్ అని, ప్రతి అంశాన్ని పరిగణలోనికి తీసుకున్న చరిత్రాత్మకమైనది అన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిన జరిగిన తర్వాత, గత అప్పులు తీర్చుతూ, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ, సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ… హామీల అమలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వ బడ్జెట్ ను, ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుని అభినందించాలని రేణుక అన్నారు. రాష్ట్ర బడ్జెట్ఆ యన దార్శనికత, అనుభవానికి నిదర్శనమని అన్నారు. వికసిత భారత్ లక్ష్యం కావాలంటే వికసిత రాష్ట్రాలు రావాలని దానికి అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. రాబోయే కాలంలో దేశ యువత తమ ఉద్యొగ సాధనలో విదేశాలకు తరలకుండా, ప్రస్తుత సాంకేతికత అయిన ఏ.ఐ.,క్వాంటం వ్యాలీ, డేటా సెంటర్లు ఏర్పాటు కొరకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు గూగుల్ భారతదేశం వైపు చూసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లను ప్రవేశపెట్టాయి అన్నారు. ప్రపంచ దృష్టి ఆకర్షించేలా రేర్ ఏర్త్ మెటల్స్, క్రూడాయిల్, అర్ధికం, రక్షణరంగం వంటి అంశాలలో మోడి నాయకత్వంలో భారత దేశం ముందుకు వెళుతుందని రాష్ట్ర బిజేపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక అన్నారు.
ట్రేడ్ పాలసి ఇప్పటివరకు దిగుమతులపై ఆధారపడి ఉండటంవల్ల సెమి కండక్టర్స్, అలాగే 97000 వేల కోట్లు సంక్షేమం మీద, 53వేలు అభివృద్దిమీద పెట్టుబడి పెట్టి, లోటు బడ్జెట్ తగ్గించుకుంటూ, అమరావతి రాజధాని, రాష్ట్రానికి తలమానికమైన పోలవరం ప్రాజెక్ట్ లపై కేటాయింపులు, కేంద్రపాలసీలో అమృతరిజర్వాయర్ల ద్వారా రాష్ట్రంలో ఎక్కువ విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వారంగానికి బడ్జెట్లో పెద్దపీటవేశారు. అదేవిదంగా నారీ శక్తి మిషన్ ద్వారా మహిళలు అన్నిరంగాలలో ముందంజలో ఉంటూ, చీనాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఇంజనీరుగా మహిళపాత్ర ఏవిదంగా ఉందొ మనం చూశామని ఆమె అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు నిర్మాణాత్మకమైనవిగా ఉన్నాయని అన్నారు. అంధ్రులమదిలో మోడీ – మోడీ మదిలో ఆంధ్రులు అనే విదంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్త్రానికి సహకారం అందిస్తుందని అన్నారు.


