వార్త‌లు

న్యాయసేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయం

ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్. శ్రీదేవి, గురువారం తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహారవసతి వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయసహాయం గురించి తెలియచేస్తూ, ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే న్యాయ సేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని, అందరూ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా జడ్జితో పాటు న్యాయసేవల సంస్థ జిల్లా […]

వార్త‌లు

ఇరగవరం పీహెచ్సీ పరిధిలో టీబీ డే ర్యాలీ

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని ఇరగవరం పీహెచ్సీ పరిధిలోని టీబీ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో రెండు వారాలకు మించి దగ్గు ఆకలి మందగించడం రాత్రి జ్వరం రావడం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి సర్వే ద్వారా టెస్టులు చేయించి వారికి టీబి ముందు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెడికల్ ఆఫీసర్ Dr Y Mounika తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చైతన్య సిహెచ్ఓ ఖాన్ గారు

వార్త‌లు

కార్మికోద్యమానికి మార్గదర్శి కలిదిండి భీమరాజుకు ఘన నివాళి

కార్మిక సంఘాల కార్యకలాపాలను కొత్త పుంతలు తొక్కింది వారిని రాజకీయ సామాజిక ఉద్యమాల బాట పట్టించిన మార్గదర్శి కలిదిండి భీమరాజు చిరస్మరణీయుడు అని ఆయన 93 వ జయంతి సభలో డి. వి. వి. యస్. వర్మ కొనియాడారు.2014 లో మోదీ ఎన్నికకు ముందే ” మోదీ ఎన్నికల రణతంత్రం” పేరుతో పుస్తకాన్ని ప్రచురించి కార్మికవర్గం భాగస్వామ్యంతో రాజకీయ ప్రచారాన్ని సాగించారని, హిదూత్వ రాజకీయం విద్వేష రాజకీయాన్ని బట్టబయలు చేసే ” భారతీయులం, గాంధ హత్య వెనుక-

వార్త‌లు

విశాఖ తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం

హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కందుల దుర్గేష్,శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు రూ. 250 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం.. రెండేళ్లలో పూర్తికి చర్యలు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విశాఖపట్నంలోని సాగర్ నగర్-ఎండాడ సమీపంలో (సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక) పీవీఆర్ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ

వార్త‌లు

గత ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ పేరుతో సాక్షి క్యాలెండర్ విడుదల చేసిన జగన్

ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు తణుకు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ నిరుద్యోగులకు అండగా ఉంటూ వారి ఆశల ఆకాంక్షలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం కేవలం కూటమి ప్రభుత్వానికి దక్కిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ప్రతి నెల

వార్త‌లు

ఉగాది పురస్కారాలు పేరిట రాష్ట్రప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం

ప్రముఖ పాత్రికేయులు సతీష్ చందర్ ను ఉగాది పురస్కారాలు పేరిట రాష్ట్రప్రభుత్వం అవమానించిన తీరును ఖండిస్తున్నాం – గొల్లపల్లి అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు2026 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను ప్రకటించింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 126 మందికి పురస్కారాలు అందజేస్తూ జీవో నెంబర్ 27ను జారీ చేసింది. ఆ జీవో లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, పాత్రికేయులు, నవలా రచయిత సతీష్ చందర్

వార్త‌లు

కొత్త ఏడాది ప్రజలందరికీ శుభకరం కావాలి : ఎమ్మెల్యే బొలిశెట్టి.

తాడేపల్లిగూడెం: శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభకరం కావాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు సాగాలని, శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. నూతన తెలుగు సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా, గురువారం శ్రీశ్రీశ్రీ బలుసులమ్మ వారిని ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవతశ్రీ బలుసులమ్మ వారి జాతర మహోత్సవంలోఈ సంవత్సరం ఉగాది పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుందని అన్నారు. 12

వార్త‌లు

పరాభవం కాదు – ప్రాభవం

తెలుగు కళా వైభవాన్ని పునరుద్ధరిస్తున్న కూటమి ప్రభుత్వం :విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా కవులు, కళాకారులు, రచయితలకు సమున్నత గౌరవం అందిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ “తెలుగుకు వెలుగు తెస్తున్న నేత”గా సీఎం చంద్రబాబునాయుడును అభివర్ణించిన మంత్రి దుర్గేష్ “పరాభవ” నామ సంవత్సరం అంటే అన్యాయం, అక్రమాలు, తప్పులు చేసే వారికి పరాభవమని, మంచి,న్యాయం చేసే కూటమి ప్రభుత్వానికి ఇది “ప్రాభవ” (విజయ) సంవత్సరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్

వార్త‌లు

తణుకు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలలో ఉగాది ఉత్సవం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తణుకులో నిర్వహించిన ఉగాది ఉత్సవం మరియు పదసంచలనం కార్యక్రమం అత్యంత వైభవంగా, శోభాయమానంగా జరిగింది. మాంటిసోరి స్కూల్ గ్రౌండ్స్‌లో మాన్యనీయ సంఘచాలక్ శ్రీ మద్దిపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వయంసేవకులు పూర్తి గణవేష్‌లో పాల్గొని క్రమశిక్షణ, దేశభక్తి భావాలను ప్రతిబింబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జే.కే హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తంగిరాల తిరుమల ప్రకాశ్ నాగేంద్రనాథ్ హాజరై సందేశం అందించారు. ముఖ్య వక్తగా శ్రీ కోర్సిపాటి శ్యాం

Scroll to Top