ఉండ్రాజవరం వేలివెన్ను గ్రామాల పి.హెచ్.సి.ల పరిధిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ఉండ్రాజవరం :
 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఉండ్రాజవరం, వేలివెన్ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు  డా. దుర్గ మహేశ్వర రావు, డా.వై. సృజన, డా. ఎస్.డి..ఇర్ఫాన్ పర్యవేక్షణలో ఉండ్రాజవరం ఎం.వి.ఎన్.జడ్.పి.హైస్కూల్ నందు పాల్గొని అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా తాడిపర్రు జిల్లా పరిషత్ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ నందు అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ విధానాన్ని మరొక వైద్యాధికారి డా.ఆర్.ఉషాదేవి, సూపర్వైజర్ మేరీ రత్నకుమారి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో గల స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ను వైద్యాధికారులతో పాటు సి.హెచ్.ఓ సుబ్రహ్మణ్యం, పి.హెచ్.ఎన్.కె.డి.వి.ఎల్.కుమారి, సూపర్వైజర్ శ్రీరామమూర్తి, రత్నకుమారి, ఆరోగ్య పర్యవేక్షకురాలు కె. కె. సుభాషిణి, ఏ.ఎన్.ఎం. సునీత, భాగ్యలక్ష్మి, భవాని, లిల్లీ., బి.సునీత, సరస్వతి, హెచ్.అంబేద్కర్ పర్యవేక్షించారు. ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 5303 మంది పిల్లలకు గాను 5037 మంది పిల్లలకు అనగా  95% మంది పిల్లలకు అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ జరిగినట్లు వైద్యాధికారి డా. దుర్గ మహేశ్వర రావు తెలిపారు. మిగిలిన వారికి ఈ నెల 24వ తేదీన అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ చేపడతామని తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link