ఘనంగా సాహితీ సామ్రాజ్యం పంచమ వార్షికోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక యాపిల్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ భాష దినోత్సవం, సాహితీ సామ్రాజ్యం పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అక్షరాల భాష కమ్మనైన పద కళ భాష నా తెలుగు అని అన్నారు. ఆపిల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అనుపోజు దినేష్ బాబు మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్న తెలుగు భాషను ప్రేమించు అని అన్నారు అనంతరం మాతృభాష మనుగడ అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేసినారు. ఈ సందర్భంగా అనుపోజు దినేష్ బాబును కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి సౌజీ ప్రసన్నను సువర్ణ జ్యోతి ఎడిటర్ గుమ్మడి ఆంజనేయులు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు బి.గంగాధర్, అధ్యాపకురాలు వై. ఐశ్వర్య, టి. యానీ ఏంజెల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link