వార్త‌లు

విద్యార్థులు సెల్ ఫోన్లు పట్ల జాగ్రత్తగా ఉండాలి

 ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా పైడిపర్రు సోషల్ వెల్ఫేర్ కాలేజీ బాయ్స్ హాస్టల్, యందు బుధవారం తణుకు న్యాయవాదులు, పోలీసు అధికారులు పిల్లలకు ర్యాగింగ్, డ్రగ్స్ మరియు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని, కొన్ని అసాంఘిక శక్తులు పిల్లల్ని పాడు చేయడం కోసం డ్రగ్స్ అమ్మకం, రవాణా చేయడం కోసం విద్యార్ధులను వాడుకుని వారి జీవితాలు నాశనం చేస్తున్నారని అన్నారు.  విద్యార్థులు ఒక్కసారి కేసులలో ఇరుక్కుంటే వారి జీవితం నాశనం అవుతుందని తెలిపారు. అలాగే […]

వార్త‌లు

ఆటో కార్మికుల ఐక్యత  – హక్కుల సాధన మా లక్ష్యం

తణుకు పట్టణంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తణుకు పట్టణంలో సుమారు 2,000 ఆటోలు, వాటికి అనుబంధంగా 11 ఆటో కార్మికుల యూనియన్లు పనిచేస్తున్నాయి.ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న ఆటో కార్మిక సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలం, సాధించగలమనే సంకల్పంతోతణుకు పట్టణంలోని అన్ని ఆటో యూనియన్లను కలిపి “తణుకు టౌన్ ఆటో కార్మికుల యూనియన్” ఏర్పాటు చేయడం జరిగింది.ఆటో

వార్త‌లు

చదువుతోనే జీవన ప్రమాణాలు మెరుగు

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఎస్సీ బాలికల వసతి గృహంలో దుప్పట్లు పంపిణీ మహిళలకు చదువు ఆయుధం అని, చదువుతోనే భవిష్యత్తులో జీవన ప్రమాణాలు మెరుగు అవుతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.  సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తణుకు ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్.వి.అరుణ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు.తల్లిదండ్రులు, కుటుంబాలతో

వార్త‌లు

వేల్పూరు సొసైటీ సేవలు ఆదర్శనీయం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రైతులకు సేవలు అందించడమే కాక ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సొసైటీ త్రీ మెంబర్ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రం ఆసుపత్రి

వార్త‌లు

డి.ఎస్సి అక్రమాలపై పోరాటం.. పోలీసుల ఆంక్షల మధ్య భారీ ర్యాలీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం  నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలో డి.ఎస్సీ అక్రమాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పాటు పలు ఆంక్షలు విధించినప్పటికీ, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయ అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ

వార్త‌లు

తణుకు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్వర్యంలో ఆషాడమాస సారె సమర్పణ

తణుకు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్వర్యంలో తణుకు పట్టణములో వేంచేసినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ గోవిందమ్మకు, శ్రీ కామాక్షమ్మ వార్లకు ఆషాడమాసం సందర్భంగా విశ్వబ్రాహ్మణ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని సారె సమర్పించినారు తొలుత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్ ఇంటి దగ్గర నుండి పట్టణ వీధుల మీదుగా భాజా భజంత్రీలతో ఊరేగింపుగా బయలుదేరి స్వామివారి ఆలయానికి వచ్చి స్వామివార్లకు అమ్మ వార్లకు పూలమాలలను అలంకరించి అమ్మవార్లకు

వార్త‌లు

లోకేష్‌ వెంట నడిచిన వారికే డీఎస్సీ ఉద్యోగాలు

కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌నాయుడు ధ్వజమెత్తారు. డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని, మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖామంత్రి లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకుసుకున్న అవకతవకలపై నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలులోని ఆర్వోబీ వద్ద జి.శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీసీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు,

వార్త‌లు

పేపర్ లీకేజీలు , పరీక్షల అవినీతికి వ్యతిరేకంగా ఐసా ఆధ్వర్యంలో నిరసన

పేపర్ లీకేజీలు , పరీక్షల అవినీతికి వ్యతిరేకంగా ఏ ఐ యస్ ఏ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతా లో భాగంగా నిన్న జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచి లో ఆమెపై కొంతమంది అల్లరి మూకలు దాడి చేసి సిరా ఇంక్ పోయడాన్ని ఐసా గా తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఏ ఐ యస్ ఏ.. జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి. ఎస్ ఎన్ పి ఎస్. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి

వార్త‌లు

ఎస్.కె.ఎస్.డి జూనియర్ కళాశాలలలో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణ

స్థానిక ఎస్.కె.ఎస్.డి మహిళా జూనియర్ కళాశాలలలో శనివారం విద్యార్థి సంఘం ఎన్నికలు కళాశాల నిబంధనలు ప్రకారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ప్రచారానికి నిర్ణీత గడువు, అనంతరం పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించబడ్డాయని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించడం వలన విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందడం,

వార్త‌లు

బిజెపి బలోపేతానికి కృషిచేయాలి

భారతీయ జనతా పార్టీ ఓ బి సి మండల ఉపాధ్యక్షులుగా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన అయిశెట్టి నాగవెంకటేశ్వరరావు నియమితులయ్యారు. అలాగే భారతీయ జనతాపార్టీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన ఇర్రి లీలాకుమార్ నియమితులయ్యారు వీరిద్దరు నియామకం పట్ల రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింహాద్రి సత్యనారాయణ, మండల ఇన్చార్జి జిల్లా ఉపాధ్యక్షులు రంగినేడీ గంగాధర్, మండల అధ్యక్షులు కొప్పినేడీ సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ స్టేట్

Scroll to Top