వార్త‌లు

డర్హం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవాలు

విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్) డర్హం తెలుగు అసోసియేషన్, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ జిటిఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు29, 30 తేదీల్లో గణేష్ ఉత్సవ వేడుకలు ఓషావాసిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ భట్టర్ పురోహితులు ఆధ్వర్యంలో వినాయక ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. రెండు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే కెనడా ధోల్ కార్యక్రమం రెండు రోజులు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. […]

వార్త‌లు

జన్యు హృద్రోగ రోగులకు సమర్ధ వంతంగా చికిత్స చేస్తున్న మెడికవర్

విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్) మనదేశంలో జన్యు హృద్రోగ రోగుల సంఖ్య పెరుగుతోందని, దీన్ని సమర్ధ వంతంగా చికిత్స చేయడానికి తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మెడికవర్ ఆసుపత్రి హృద్రోగ సీనియర్ వైద్యులు డాక్టర్ కరుణాకర్ పాడి తెలిపారు. ముఖ్యంగా ఇది మేనరికపు వివాహాలు చేసుకునే దంపతులకు జన్మించే శిశువులకు పలు రకాల జన్యు లోపాల వల్ల హృద్రోగాలు వస్తున్నా యన్నారు. వీటిని చాలా ముందుగానే గుర్తించి అవసరమైన వారికి ఆధునిక శస్త్ర చికిత్సలు చేసి

వార్త‌లు

విజయవంతంగా బెంటాల్స్ శస్త్ర చికిత్స

యశోద హాస్పిటల్స్ అరుదైన విజయం విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్) హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతం అయ్యారు. మేఫెయిర్స్ సిండ్రోమ్, డైలేటెడ్ అయోర్టిక్ రూట్, అసెండింగ్ అయోర్టిక్ అనూరిజం తీవ్రమైన అయోర్టిక్ సంబంధ రెగర్జిటేషన్‌తో బాధపడుతున్న 28 ఏళ్ల పేషేంట్ ఉరిటి అనిల్ కుమార్‌కు బెంటాల్స్ శస్త్రచికిత్సను నిర్వహించారు.రోగికి శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని, అవసరమైన వివిధ పరీక్షలు నిర్వహించగా

వార్త‌లు

నిరక్షరాస్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చదువే

ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి చేపట్టిన అక్షర ఆంధ్ర ఉల్లాస్ మండల స్థాయి శిక్షణా కార్యక్రమం ఉండ్రాజవరం వెలుగు భవనంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మండల తహసీల్దార్ పి.ఎన్.డి. ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి వెంకట రామారావు హాజరయ్యారు. అతిధులు మాట్లాడుతూ మండలంలో 9000 మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని మొదటవిడతగా 2200 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దెందుకు 220 మంది వాలంటీర్ లని నియమించి ప్రతీ వాలంటీర్ కు పదిమంది నిరక్షరాస్యులను కేటాయించి

వార్త‌లు

వివోఎల సమస్యలు పరిష్కరించాలి – సిఐటియు

జియోట్యాగ్ ఫోన్లకు ఏర్పాటు చేసి, పలు రకాల యాప్లు ఇచ్చి ఉదయం నుండి రాత్రి వరకు పనులు చేయిస్తున్న ఐకెపి వివో ఏల సమస్యలు పరిష్కరించాలని ఇరగవరం మండల వివో ఏల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఇరగవరం వెలుగు మండల సమాఖ్యే కార్యాలయంలో పిల్లి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్మార్ట్ ఫోన్లు ఇచ్చి కార్మికులను కట్టు బానిసలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయిస్తున్నదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు

వార్త‌లు

కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు తక్షణం అమలు చేయాలి

అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలని తక్షణం అమలు చేయాలని. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా పూర్వపు కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా విడిపోయిన అనంతరం ఈనెల 8వ తేదీన ప్రముఖ చేనేత కేంద్రం పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో వీవర్స్ కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ

వార్త‌లు

ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చిన ముళ్లపూడి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో డాక్టర్‌ ముళ్లపూడి వర్థంతి కార్యక్రమం అనేక పరిశ్రమలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆంధ్రా బిర్లాగా కీర్తి శేషులు డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ ప్రపంచ పటంలో తణుకు ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకువచ్చారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ వర్థంతి కార్యక్రమాన్ని బుధవారం తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా ముళ్లపూడి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా నివాళులు అర్పించి

వార్త‌లు

ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి 66 మందికి రూ.35.91 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత… కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తణుకు నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు రూ. 35.91 లక్షల విలువైన చెక్కులను బుధవారం బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబునాయుడు ఆరోగ్యం, వైద్యానికి పెద్ద

వార్త‌లు

గ్రామాల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హామీ దువ్వ–ముద్దాపురం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన తణుకు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని కోరారు. తణుకు మండలం దువ్వ నుంచి ముద్దాపురం గ్రామానికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. రూ.1.50 కోట్లుతో మొదటి విడత ముద్దాపురం వరకు, రెండో విడతలో రూ.5 కోట్లుతో సీసీ

వార్త‌లు

పెరవలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆశా డే

పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఆశా డే నిర్వహించారు. ఈ సందర్భంగా పెరవలి మండలంలోని అన్ని గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని వైద్య అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ఎస్.వి.ప్రసాద్ పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెరవలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో క్షయ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా మందులుతో పాటుగా పోషకాహారం తీసుకునేలా సహకారం అందించాలని ఆశ కార్యకర్తలకు టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వి.ఆశాజ్యోతి సూచించారు.

Scroll to Top