విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్)
డర్హం తెలుగు అసోసియేషన్, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ జిటిఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు29, 30 తేదీల్లో గణేష్ ఉత్సవ వేడుకలు ఓషావాసిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ భట్టర్ పురోహితులు ఆధ్వర్యంలో వినాయక ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. రెండు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే కెనడా ధోల్ కార్యక్రమం రెండు రోజులు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి రోజు నిర్వహించిన ప్రతిష్ట పూజలో పికరింగ్ ఎంపీ జునటియా నాథన్, రెండవ రోజు కల్చరల్ కార్యక్రమాలు, ఫ్లాష్ మాబ్, ధోల్ డాన్సులతో పాటుగా 30 కేజీల లడ్డు వేలం పాట ఘనంగా జరిగింది. ఓషావా ఎంపీ రొండా కిర్కులాండ్ రెండో రోజు కార్యక్రమంలో హాజరయ్యారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది అన్ని ఉత్సవాలను కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలకు జన సంఖ్య పెరుగుతూ వస్తుందని, రెండు రోజులు పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలకు అత్యధిక మంది సభ్యులు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డర్హం తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వాతి మిరియాల, వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్ నాలం, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ జిటిఏ ప్రెసిడెంట్ సౌరబ్ బేడీ, వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర చౌబేయ్, ట్రెజరర్ భానుప్రియ పిల్లలమర్రి, ఎగ్జిక్యూటివ్ అండ్ ఆపరేషన్ హెడ్ గౌతమి ఎర్రంశెట్టి, జెనరల్ సెక్రటరీ శ్రీ భార్గవి శెట్టలూరి, కల్చరల్ హెడ్ ప్రేరణ దత్త, కల్చరల్ అసిస్టెంట్ ప్రియా వడ్డే, కల్చరల్ సెక్రటరీ సాహితీ పాల్గొన్నారు.


