పశ్చిమ గోదావరి జిల్లా
త్వరలో నరసాపురం-చెన్నై వందే భారత్ రైలు: కేంద్ర మంత్రి
నరసాపురం-చెన్నైల మధ్య వందే భారత్ రైలు త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. అత్తిలి రైల్వేస్టేషన్లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ తీసుకొచ్చామని, తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌ను రూ.25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కొనసాగుతుందని వివరించారు.


