విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్)
మనదేశంలో జన్యు హృద్రోగ రోగుల సంఖ్య పెరుగుతోందని, దీన్ని సమర్ధ వంతంగా చికిత్స చేయడానికి తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మెడికవర్ ఆసుపత్రి హృద్రోగ సీనియర్ వైద్యులు డాక్టర్ కరుణాకర్ పాడి తెలిపారు. ముఖ్యంగా ఇది మేనరికపు వివాహాలు చేసుకునే దంపతులకు జన్మించే శిశువులకు పలు రకాల జన్యు లోపాల వల్ల హృద్రోగాలు వస్తున్నా యన్నారు. వీటిని చాలా ముందుగానే గుర్తించి అవసరమైన వారికి ఆధునిక శస్త్ర చికిత్సలు చేసి రక్షించు కోవచ్చన్నారు. ఈ విషయా లన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల్ వ్యవస్థ కార్యక్రమం(ఆర్బిఎస్కె) పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ పథకం క్రింద జన్యు హృద్రోగాలకు ఉచితంగా చికిత్స దొరుకు తుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా వీటికి ఉచిత వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఆసుపత్రికి చెందిన కార్డియో థోరాసిక్ సర్జన్ మరియు జన్యు హృద్యోగ ఇంటర్వెన్షన్ నిపుణుడు డాక్టర్ అశోక్ రాజు మాట్లాడుతూ ఇటీవల తాము ఒడిశా రాష్ట్ర గిరిజన ప్రాంతానికి చెందిన అయిదుగురు జన్యు హృద్రోగ పిల్లలకు శస్త్ర చికిత్స చేసి రక్షించా మన్నారు. ఈ మీడియా సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, వైద్యులు డాక్టర్ సుజిత్ కుమార్ మహంతి, డాక్టర్ ఎం. విపుల్, డాక్టర్ సి. నాగ సుజిత్, డాక్టర్ వై.కృష్ణ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


