యశోద హాస్పిటల్స్ అరుదైన విజయం
విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్)
హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతం అయ్యారు. మేఫెయిర్స్ సిండ్రోమ్, డైలేటెడ్ అయోర్టిక్ రూట్, అసెండింగ్ అయోర్టిక్ అనూరిజం తీవ్రమైన అయోర్టిక్ సంబంధ రెగర్జిటేషన్‌తో బాధపడుతున్న 28 ఏళ్ల పేషేంట్ ఉరిటి అనిల్ కుమార్‌కు బెంటాల్స్ శస్త్రచికిత్సను నిర్వహించారు.రోగికి శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని, అవసరమైన వివిధ పరీక్షలు నిర్వహించగా వాటిలో వాల్వ్ పనిచేయకపోవడం వంటి డైలేటెడ్ హార్ట్ చాంబర్ సమస్య ఉన్నట్టు గుర్తించినట్టు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా తెలిపారు. నగరంలోని ఓ స్టార్ హోటల్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశలో ఆయన మాట్లాడుతూ యశోద హాస్పిటల్స్ అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జరీ డాక్టర్ శివశంకర రెడ్డి తలపరెడ్డి బృందంతో కలిసి శాస్త్ర చికిత్స నిర్వహించినట్టు వివరించారు. జూన్ 26న, పేషెంట్‌కు జనరల్ అనస్థీషియా కింద 31ఎంఎం ఎస్ జె ఎం మెకానికల్ వాల్వ్డ్ కండ్యూట్తో బెంటాల్స్ ప్రొసీజర్ చేశామని, శస్త్రచికిత్స అనంతరం, ఐసీయూ లోచికిత్స నిర్వహించి, లైఫ్ సపోర్ట్‌ను తొలగించామని తెలిపారు. రోగి తొందరగానే కోలుకున్నాడని, జూలై 2న డిశ్చార్జ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. బెంటాల్స్ ప్రొసీజర్ చాలా డిమాండ్ ఉన్న మరియు ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్స అన్నారు. అరుదైన అయోర్టిక్ అనూరిజమ్స్, వాల్వ్ వ్యాధి కలిగిన అనిల్ కుమార్ విషయంలో, సకాలంలో రోగ నిర్ధారణ, అధునాతన శస్త్రచికిత్సా పద్ధతులు, అద్భుతమైన ఫలితాన్నిచ్చినట్టు తెలిపారు. ఈ సందర్బంగా అనారోగ్య సమస్య నుంచి కోలుకున్న అనీల్ కుమార్ మాట్లాడుతూ యశోద హాస్పిటల్ వైద్యులు చక్కటి చికిత్స అందించి ప్రాణం పోశారని తెలిపారు.


