ఎర్రంపేట గ్రామంలో రూ.60 లక్షలతో డబ్ల్యూబీఎం రోడ్డుకు శంకుస్థాపన
కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో సుమారు రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న డబ్ల్యూబీఎం రోడ్డుకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఎర్రంపేట గ్రామానికి ఎంతోకాలంగా అవసరమైన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలోని […]






