ఆపదలో అభయహస్తం.. పేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్

మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు క్యాంపు కార్యాలయంలో రూ. 25.16 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీల పంపిణీ

నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 607 మందికి రూ. 4.56 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి

ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అడుగులు వేస్తోందని, పేదవాడికి వైద్యం భారం కాకూడదన్నదే తమ సంకల్పమన్న మంత్రి దుర్గేష్

సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత లబ్ధిదారులు

నిడదవోలు: “వైద్యం పేదవాడికి భారం కాకూడదనేదే కూటమి ప్రభుత్వ సంకల్పం” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 16 మంది బాధితులకు రూ. 25,16,162 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మరియు ఎల్ వోసీ పత్రాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. మొత్తం 16 మంది బాధితులలో 13 మందికి రూ. 20,61,588 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, మరో ముగ్గురికి రూ. 4,54,574 విలువైన ఎల్ వోసీ పత్రాలను మంత్రి దుర్గేష్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ వోసీ మరియు ప్రత్యేక ఆర్థిక సాయం కింద మొత్తం 607 మందికి రూ. 4,56,41,986 లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబునాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.

కష్టకాలంలో తోడుండే నిజమైన బంధువు ముఖ్యమంత్రి సహాయ నిధి అని, ఇది పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజలందరికీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని, వైద్య ఖర్చుల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన భరోసా ఇచ్చారు.

తమకు కష్టకాలంలో అండగా నిలిచిన మంత్రి కందుల దుర్గేష్‌కు మరియు కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link