తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, కొత్తపాడు గ్రామం సొసైటీ నందు 590 మంది సభ్యులు సుమారు 8 లక్షల 50 వేల రూపాయలు రైతులకు పావలా వడ్డీ లు ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కారెం బాబురావు మాట్లాడుతూ కొత్తపాడు సొసైటీ ఎన్ని ఇబ్బందులు ఉన్న శాసన సభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ చొరవతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సకాలంలో అందించాం, గత ప్రభుత్వ హయాంలో రైతులు అమ్మిన ధాన్యానికి రెండు, మూడు నెలలకు డబ్బులు ఇచ్చారు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 48 గం,,లకు రైతు అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది, నీటి ఎద్దడి రాకుండా నీటి సంఘాల ద్వారా కాలువలో పూడిక తీయడం, మురుగు కాల్వలు తవ్వించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు,తీసుకున్నటువంటి రుణాలు సకాలంలో చెల్లిస్తే రైతులకు పావలా వడ్డీ తో పాటు వివిధ సదుపాయాలు పొందవచ్చు, అలాగే సకాలంలో చెల్లించకపోతే పావలా వడ్డీ రాకపోగా పెనాల్టీలు పడుతున్నాయి, రుణ ఖాతాని తీయబడుతుంది, అలాగే రైతులు సకాలంలో తీసుకున్న రుణాలు చెల్లించి సహకార సంఘ అభివృద్ధికి తోడ్పడాలని, అలాగే ఈ సొసైటీ మన అందరిదీ దీనిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత నాతో పాటు మనందరికీ ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పశువుల దాన వంటి సదుపాయాలు కల్పిస్తామని, డిపాజిటర్స్ కు ఆకర్షణ ఏమైనా వడ్డీ ఇవ్వబడుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బొక్క కృష్ణ గారు, ఇరగవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొంతు శీను, కాకిలేరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి గిరి,సతీష్, దండు గణపతిరాజు, దండు సూర్యనారాయణరాజు, బొక్క రామకృష్ణ, సిరి శెట్టి శ్రీను, నేకూరి ప్రసాద్ సొసైటీ సిబ్బంది కూటమి నాయకులు,రైతులు పాల్గొనడం జరిగింది.


