జిల్లా ఎయిడ్స్, లెప్రసి అండ్ టి బి ఆఫీసర్ (D.A.L.T.O) డా.వసుంధర ఆధ్వర్యంలో, ఉండ్రాజవరం -1 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వద్ద, ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.బి.దుర్గామహేశ్వరరావు పర్యవేక్షణలో, ఐ. సి. టి. సీ. కౌన్సిలర్ సుచిత్రప్రియ బృందం గర్భిణులు, ఇతరులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి, కూడా రక్త పరీక్షలు నిర్వహించినారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుచిత్రప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ లైంగిక వ్యాధులు ఏ విధముగా వస్తాయి, రాకుండా ఏ జాగ్రత్తలు పాటించాలి, ఒకవేళ లైంగిక వ్యాధులకు గురి అయితే ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ చికిత్స పొందాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి మొదలగు వాటిపై అవగాహన కల్పించారు. గర్భిణులు ప్రతీ ఒక్కరూ ముందుగానే ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా, వారికి వచ్చిన లైంగిక సంపర్క వ్యాధులు, పుట్టే బిడ్డలకు రాకుండా ముందుగానే వైద్యుల సలహా మేరకు చికిత్స పొందితే, ఆరోగ్యవంతమైన బిడ్డను కనడానికి అవకాశం ఉన్నదని, కావున ప్రతీ ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఈ రక్త పరీక్షలు చేయించుకోవాలని, అదేవిధముగా టి.బి. వ్యాధిగ్రస్తులు కూడా తప్పనిసరిగా ఈ రక్తపరీక్షలు చేయించుకోవాలని, తద్వారా వారికి కూడా వైద్యనిపుణులు ద్వారా సరియైన సమయంలో, సరియైన చికిత్స అందించడం ద్వారా ఆరోగ్య వంతులుగా మార్చవచ్చునని తెలియ చేశారు. లాబ్ టెక్నీషియన్ హర్ష రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ. ఎం. సుబ్రహ్మణ్యం, పి.హెచ్. ఎన్. కె. డి. వి. ఎల్. కుమారి, సుపరవైజర్ ఏ. శ్రీరామమూర్తి, హెచ్.వి.మేరీరత్నకుమారి, ఎం.హెచ్.పి.లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


