ప్రయాణంలో గుండెపోటుతో ప్రభుత్వవైద్యుని మృతి

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీర వెంకట సత్య తాతారావు (56) నిడదవోలు పట్టణానికి చెందిన ప్రముఖ ప్రభుత్వ వైద్యుడు, అమ్మ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ తాతారావు గుండెపోటుతో మరణించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి వైద్యులు ఎంతవరకు ప్రయత్నించినప్పటికీ, చివరకు ప్రాణాలు దక్కలేదు.
బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చినా ఆయన ఆరోగ్యం బాగాలేదు అని ఈసీజీ తీయించుకొని కారులో తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉండ్రాజవరం సమీపంలో ఆయన కారును పక్కకు ఆపగా, స్థానికులు వెంటనే స్పందించి కారు డొర్స్ ఓపెన్ కాకపోవడంతో, బండరాయితో కారు అద్దం పగులకొట్టి ఆయనను బయటికి తీసారు. అంబులెన్స్ వచ్చేలోపుగా ప్రాధమికంగా యువకులు సి.పి.ఆర్.చేసారు. తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు డాక్టర్ తాతారావు అస్వస్థత విషయం తెలిసిన వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉండ్రాజవరం సమీపంలో గుండెపోటుతో అస్వస్థతకు గురైన డాక్టర్ తాతారావుని సమీపంలో ఉన్నవారితో కలిసి అంబులెన్స్‌లో స్వయంగా ఎక్కించి, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికీ, చివరి వరకు ఆయన పక్కనే నిలిచి వైద్యులకు అవసరమైన సహకారం అందించారు.
అయితే డాక్టర్లు ఎంతవరకు ప్రయత్నించినా ప్రాణాలు దక్కకపోవడం ప్రాంతాన్ని విషాదంలో ముంచెత్తింది. ఒక వైద్యవేత్తను కాపాడేందుకు మరో ప్రజా ప్రతినిధి చూపిన మానవత్వం అందరి ప్రశంసలు అందుకుంది.
బూరుగుపల్లి శేషారావు గారి స్పందన, తక్షణ చర్యలు మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రజా సేవ అంటే పదవిలో ఉండడమే కాదు, అవసరమైన సమయంలో ముందుండి సహాయం చేయడమని ఆయన మరొక్కసారి చాటిచెప్పారు.
డాక్టర్ తాతారావు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ వైద్యుడిగా సేవలందిస్తూ, వేలాది మంది పేద ప్రజలకు అండగా నిలిచారు. అందుబాటులో ఉండే వైద్యుడిగా, మానవత్వం కలిగిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించారు. ఆయన మరణవార్తతో నిడదవోలు పట్టణం శోకసంద్రంగా మారింది. ప్రజాప్రతినిధులు, సహచర వైద్యులు, రోగులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top
Share via
Copy link