భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ పుణ్యతిథి సందర్భంగా “సమర్పణ దివస్” జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బొల్లిన నిర్మల కిషోర్ , రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పెద్దిరెడ్డి రవి కిరణ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి భోగి రెడ్డి ఆదిలక్ష్మి ,రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక, యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.సింధు, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీమతి అల్లూరి పద్మా వర్మ, జిల్లా మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ ఉన్నమట్ల కపర్ది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయం, సుపరిపాలన అనే సిద్ధాంతాల ద్వారా భారత ఆత్మను ప్రతిబింబించిన మహనీయుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అని నాయకులు పేర్కొన్నారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తి అభివృద్ధిలోనే దేశ ప్రగతి దాగి ఉందనే భావనను జీవిత సత్యం గా మలిచిన మహోన్నత నాయకుడని కొనియాడారు. అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగా సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, ఆయన చూపిన మార్గంలో పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. దేశ నిర్మాణంలో ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు.


