వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి.శ్రీనివాస్ నాయుడు వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపక్షపాతి నిరంతరం బడుగు బలహీనవర్గాల క్షేమం కోరుకునే జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధనలో వైసీపీపార్టీ నిరంతరం కృషిచేస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం మండల వైసీపీ అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచ్ లు భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.



