జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారులకు కేసులు రాజీ ద్వారా సమయం, డబ్బు ఆదా

దిసెప్టెంబర్ 12వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయుట గురించి తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఉండ్రాజవరం, పెనుమంట్ర, అత్తిలి, తణుకు టౌన్ పోలీసు అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి, కక్షిదారులు రాజీపడు క్రిమినల్ కేసులలో ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఇరు పార్టీలకు కౌన్సిలింగ్ కేసులు రాజీ చెయ్యాలని కోరుతున్నారు, చిన్న చిన్న కేసులు రాజీ చేసుకుని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సుంకర శ్రీదేవి, రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి కె. కృష్ణవేణి, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. వెంకటరమణ, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్లు, కోర్టు పోలీసు, లైజనింగ్ ఆఫీసర్ ఎస్.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link