(ఉండ్రాజవరం) : ఆగస్టు 27: ఉండ్రాజవరం మెయిన్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ బాల భక్తాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణ నిమిత్తం, ఏ. పి. పౌల్ట్రీ ఫెడరేషన్ మెంబర్, ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నిడదవోలు నియోజకవర్గ టిడిపి నాయకులు, తణుకు ఏఎంసి మాజీ చైర్మన్ శ్రీ గన్నమని శ్రీరామారావు శ్రీమతి వీర వెంకట మంగతాయారు దంపతులు ఆలయ నిర్మాణ నిమిత్తం రూ. 10 లక్షల రూపాయలు భారీ విరాళాన్ని శ్రీ బాల భక్త ఆంజనేయ దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో భారీవిరాళం అందజేసి, ఆలయానికి సంబంధించిన ప్రతి అంశంలో, నిర్మాణంలో అన్ని విధాలా సహకరిస్తున్న గన్న మని కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల భక్తాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు తోట సోమేశ్వరరావు, అధ్యక్షులు కోటిపల్లి శంకర జయకృష్ణ, ఉపాధ్యక్షులు యిర్రి సుబ్బారావు, సెక్రటరీ ఉంగరాల శ్రీనివాసు, జాయింట్ సెక్రెటరీ తోరాటి శ్రీను, కమిటీ సభ్యులు మీసాల మురళి, కోటిపల్లి పెద్ద శ్రీను యిర్రి వెంకన్న, కాళ్ళ మంగరాజు, యిర్రి వెంకటేశ్వర్లు, కనకం అజయ్, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, తమనంపూడి వీర్రెడ్డి, వెలగల రాము, కామిన సతీష్ పైండా సాయి, ఇర్రి రాంబాబు కూనపరెడ్డి వాసు, కోటిపల్లి దుర్గా రాము తదితరులు పాల్గొన్నారు




