వందేమాతర స్పూర్తి ప్రతీ ఒక్కరికీ చేరాలి – బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక

వందేమాతర స్పూర్తి రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన విస్తరింపచేయాలని బిజెపి సంకల్పించిందని, వందేమాతర స్పూర్తి ప్రతీ ఒక్కరికీ చేరాలని, ఈ సందర్భంగా బిజేపి విధానాన్ని తెలియజేయడానికి మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బిజెపి రాష్ట్ర అదికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ భారత 80వ స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై నుంది వందేమాతరమును పూర్తి చరణములతో ఆలపించిన సంగతి అందరికీ తెలిసిందే, ఆ సందర్భంలో ప్రతీ భారతీయుని గుండె ఎంతో ఉప్పొంగిన మాట వాస్తవమని, వందేమాతరం అనేది ఒక మంత్రమని, స్వతంత్రపొరాటంలో ప్రతి భారతీయుని మదిలో వందేమాతరం ప్రతిద్వనించిందని రేణుక అన్నారు. అటువంతి వందేమాతరాన్ని జనగణతో సమాన హోదా కల్పించి, పూర్తిగా అంటే 6 చరణాలు పాడే విదంగా పార్లమెంటు ఉభయ సభల్లో చట్టం చేసారని అన్నారు. జాతీయ గేయం ఆలపించడంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం పట్ల, ఆగస్టు 15న డిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వందేమాతరాన్ని 2 చరణాన్ని ఆలపించిన తరువాత సొనీయా గాంధి, రాహుల్ గాంధీలకు కోపం వచ్చి, మిగిలిన చరణాలను మనం పాడవలిసిన అవసరంలేదు అన్న వీడియోలను దేశమంతా చూసారని, వందేమాతరాం పట్ల కాంగ్రెస్ తీరును నించాలని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ 2 చరణాలకే కట్టుబడి ఉన్నామని అనడం, చట్టలకు గౌరవం ఇవ్వకపోవడం, తీర్మానానికే కట్టుబడి ఉన్నామనడం కాంగ్రెస్ పార్టీ విధానానికి నిదర్శనమని, వారు చట్టరీత్యా శిక్షార్హులని రేణుక అన్నారు. భారత దేశంలో ప్రతీపౌరునికి, ముఖ్యంగా యువతకు మన చరిత్ర తెలియాల్సిన అవసరముందని అన్నారు. వందేమాతరమంటే భరతమాతకు వందనమని, ఒక జాతీయభావాన్ని తెలియజేయడమని, పొరాటపఠిమ, స్పూర్తిని రగిలించే గేయమని అన్నారు. ఆనాడు మహాత్మా గాంధి తెలిపారని వందేమాతరం సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేలా బకించంద్ర చటర్జీ రచించారని, తనకు అవగాహన లేకపొయినా ఈ గేయాన్ని ఆలపించానని గాంధీజీ అన్నారని అన్నారు. ఆన్నాడు ముస్లీం లీగ్ రాజకీయం కోసం రాజీపడ్డారో, అదే భావజాలం కాంగ్రెస్ నేటికీ పాటించడం , కొన్ని మతపరమైన ఓట్ల కోసం మేము వందేమాతరం పాడము అని కాంగ్రెస్స్ అనడాన్ని బిజెపి ఖండిస్తుందని ముళ్ళపూడి రేణుక అన్నారు

Scroll to Top
Share via
Copy link