(తణుకు) ఆగస్టు 28: తణుకు కోర్టు లో జరుగు జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు ఎక్కువ రాజీ చేయుటకు గౌరవ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణవేణి పెరవలి, ఇరగవరం, పెనుగొండ, తణుకు రూరల్ పోలీస్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి కక్షిదారులకు రాజీకి అనువైన కేసులలో ఇరు పార్టీలకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ చెయ్యాలని కోరారు. కక్షీధారులకు లోక్ అదాలత్ ఉపయోగాలు తెలియచేయాలని తెలిపారు , కేసులు రాజీ చేసుకొనుట వల్ల విలువైన సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణవేణి, పోలీస్ అధికారులు, లైజనింగ్ ఆఫీసర్ ఎస్.క్రిష్ణముర్తి, కోర్టు పోలీస్ లు పాల్గొన్నారు.



