అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ శుక్రవారం రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరళాదేవి పట్టణ ప్రముఖులు, నాయకులకు బంధుమిత్రులకు నుదుట కుంకుమ, చేతికి రాఖీ కట్టి హారతి నందించి స్వీట్లు పంచుతూ రాఖీ పండుగను ఎంతో ఆహ్లాదకరంగా జరిపారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనురాగానికి ఆప్యాయతకి ప్రతిరూపమన్నారు, ద్వాపరయుగ నుంచి ఈ రాఖీ పండుగ జరుగుతున్నట్టుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత సమాజంలో రాఖీ పండుగ తప్పనిసరిగా నిర్వహించాలని, నేటి యువతకు మన రక్తసంబంధీకులే కాకుండా ఇరుగుపొరుగున ఏ మహిళ కనపడిన మన తోబుట్టుగా చూడాలనిపించే చక్కని ఆలోచన కలుగజేసే ఒక మంచి సంప్రదాయమైన పండుగ ఈ రాఖీ పండుగ అని, చిన్నదశ నించి చిన్నారులు తమ తోటి వారిని తోబుట్టుగా చూస్తే మంచి ఆలోచనతో కూడిన పండుగ అని ప్రతి తల్లిదండ్రులు తమ తమ చిన్నారులచే ఈ పండుగ జరిపించాలని‌ సరళాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మేటి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, ఫాస్ట్ డిస్టిక్ గవర్నమెంట్ దామెర రంగారావు, మాదిరెడ్డి బాబురావు, తామరాపు సత్యనారాయణ, తాతపూడి మారుతీరావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాఖీ పండుగ సందర్భంగా జరుపుతూ సోదర భావాన్ని పెంపొందిస్తూ సంస్కృతిని పెంపొందించే దిశలో ఎప్పుడు పయనిస్తూ, మాకు రాఖీలు కట్టి అందరికీ ఆదర్శంగా వుంటూ, ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ పండుగకి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నందున, సరళాదేవికి అభినందనలు తెలుపుతూ మాట్లాడినారు. అనేకమంది లైన్ మెంబర్స్ చీకటి శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, వింజమూరు సుబ్రహ్మణ్యం, ఎం.కోటేశ్వరరావు, ఎన్.బాలాజీ, పెచ్చెట్టి రాంబాబు, వాతాడ రంగనాథ్, రమేష్ గుప్తా, పాలా రాజు, ఓమ్మి రాంబాబు, చింతలపూడి సన్యాసిరావు, ఆకేటి సత్యనారాయణ, బట్టవిల్లి నాగరాజు, తోట ఏసు, కే.వి.ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం సిద్ధాంతి, దూలం విక్రమ్, కె. వెంకన్నబాబు, చంద్రశేఖర్, కే.మల్లికార్జున తదితరులకు తిలకం, హారతి, స్వీట్లు అందించి అందరికీ రాఖీలు కట్టారు. అనంతరం వావిలాల రమేష్ కి కే.శ్యామల, ఎం.జ్యోతి, కాజులూరి గంగా, కాజులూరు సుబ్బలక్ష్మి, కె.దుర్గ, ఏ.అన్నపూర్ణ తదితరులు రమేష్ కి రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ కుప్పాల ఇందిరా దేవి, తణుకు రేవతి, దూలం చిట్టి పాప, తోట లావణ్య, బట్టువల్లి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link