స్వాతంత్ర్యం అంటే సమానత్వం, సమాన హక్కులు, అవకాశాలు ప్రజలందరికీ అందాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చినవీరభద్రరావు అన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు సందర్భంగా భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక మినీ బైపాస్ రోడ్ లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సహిద్ సర్దార్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ భారతదేశంలో రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన తర్వాత 1947 ఆగస్టు 15న విముక్తి పొంది భారత దేశంగా 80 ఏళ్ల క్రిందట అవతరించిన ఈ మహత్తర దినాన్ని మన ప్రతి సంవత్సరం జాతీయ పండుగగా జరుపుకుంటూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసా వెంకటేశ్వరావు, నాగేశ్వరరావు, సోరపల్లి రామకృష్ణ, తిప్పా త్రినాధ్, అయిశెట్టి భాను ప్రకాష్, దువ్వపు తాతారావు, రుద్రాక్షల శ్రీనివాస్, మల్లాడి ఉమా వెంకటేశ్వరరావు, పోలిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.




