తణుకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల పరిషత్ సాధారణ సమావేశము మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు అధ్యక్షతన జరిగింది. సదరు సమావేశములో శాఖలవారీగా సంభదిత శాఖల అధికారులు మండలలో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పదకాలకు సంబందించి సమావేశములో సభ్యులు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అడిగిన సందేహాలకు అధికారులు వివరణ ఇచ్చారు.
ఈ సమావేశములో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మండల ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి. కృష్ణ చంద్రరావు , మండల స్థాయి అధికారులు, మండల ప్రజా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు




