తణుకులో భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘన నివాళి
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ తణుకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న వాజ్‌పేయి విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు బోల్లాడ నాగరాజు మాట్లాడుతూ భారత రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, సుపరిపాలనకు వాజ్‌పేయి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసి, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన మహానేత వాజ్‌పేయి అని కొనియాడారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీప్, మాజీ ప్రధాన కార్యదర్శి, ఎస్ ఐ ఆర్ (బి ఎల్ ఏ -1) కో-ఇన్‌చార్జ్ రాసాబత్తుల అనుకుమార్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు ఆకుల హరి, ప్రధాన కార్యదర్శి నూకల నాగేంద్ర, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి వెన్నమనేని రామకృష్ణ, సీనియర్ నాయకులు రాపాక రామారావు, పెదమల్లు సుబ్రమణ్యం, నాయకులు కలగర్ల శేషగిరిబాబు, కొప్పోజు కొండబాబు, పచ్చిపులుసు సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి కొత్త మాణిక్యాలరావు, శ్రీనివాస్, లక్ష్మణరావు తదితరులు పాల్గొని వాజ్‌పేయికి ఘన నివాళులర్పించారు.




