కానూరు అగ్రహారంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, కానూరులో జెడ్పీ స్కూల్ కాంపౌండ్ వాల్ ప్రారంభించిన ఎంపీ పురందేశ్వరి, మంత్రి దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు
కానూరు అగ్రహారం గ్రామం నందు రూ.20 లక్షల ఎంపీలాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, కానూరు గ్రామంలో రూ.17 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవాలు
రెండేళ్లలో రూ.4.40 కోట్లతో కానూరు అగ్రహారం , రూ.8.18 కోట్లతో కానూరు గ్రామాలను అభివృద్ధి చేశామని మంత్రి దుర్గేష్ వెల్లడి
రూ.27 కోట్లతో డి.ముప్పవరం నుండి కాపవరం వరకు రోడ్డు నిర్మాణానికి సీఎం సానుకూల స్పందన.. విజ్జేశ్వరం నుండి సిద్ధాంతం వరకు ఉన్న ఏటిగట్టును పటిష్టం చేసి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామం నందు రూ.20 లక్షల ఎంపీలాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు కానూరు గ్రామంలో రూ.17 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్ ను ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు లు ఘనంగా ప్రారంభించారు.
రూ.4.40 కోట్లతో కానూరు అగ్రహారం అభివృద్ధి
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. గత రెండేళ్ల కాలంలో కానూరు అగ్రహారంలో రూ.4.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎంపీలాడ్స్ నిధులు మంజూరు చేసిన ఎంపీ పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నియోజకవర్గంలో ఆరేడు ప్రాంతాల్లో ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టగా, మొదటి హాల్‌ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధిలో భాగంగా పంచాయతీ రాజ్ ద్వారా పల్లెపండుగ 1.0 లో రూ.15 కోట్లతో హౌసింగ్ కాలనీలో సీసీ రోడ్లు, పల్లె పండుగ 2.0 లో రూ.35.45 లక్షలతో గోదావరి కట్టని ఊరుతో అనుసంధానం చేసే 6 రహదారి పనులు చేపట్టామన్నారు. రూ.73 లక్షల జల్ జీవన్ మిషన్ నిధులతో సురక్షిత త్రాగునీరు కల్పన, రూ.30 లక్షల డీఎంఎఫ్ నిధులతో సీసీ డ్రెయిన్ నిర్మాణం, రూ.20 లక్షల ఎంపీలాడ్స్ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ. 36 లక్షల జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులతో హెల్త్ సెంటర్ భవనం నిర్మాణం, రూ.23.04 లక్షల మండల ప్రజా పరిషత్ నిధులు, రూ.19.93 లక్షల పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.8.90 లక్షలతో 4 గోకులం షెడ్లు, రూ.14.83 లక్షల విలువైన 39 సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందించడమైందన్నారు.రూ.1.64 కోట్ల శాస్కి నిధులతో మెయిన్ రోడ్డు నుండి రహదారి నిర్మాణం చేపడతామన్నారు.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రూ.27 కోట్లతో డి.ముప్పవరం నుండి కాపవరం వరకు రోడ్డు నిధులపై సీఎం సానుకూలంగా స్పందించారని, అలాగే విజ్జేశ్వరం నుండి సిద్ధాంతం వరకు ఏటిగట్టు రహదారి పటిష్ఠతకు ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.రాబోయే గోదావరి పుష్కరాల నాటికి గోదావరి తీరంలోని ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతోందన్నారు. త్వరలోనే నూతన పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించనుందని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రెండేళ్లలో రూ.8.18 కోట్లతో కానూరు గ్రామం అభివృద్ధి
రెండేళ్లలో రూ.8.18 కోట్లతో కానూరు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రూ.69.90 లక్షలతో పల్లెపండుగ 1.0 క్రింద 6 పనులు, రూ. 57 లక్షలతో పల్లెపండుగ 2.0 క్రింద 4 పనులు, రూ.5 లక్షల పంచాయితీ నిధులు, రూ.26.81 లక్షల ఎంపీపీ నిధులు, రూ.13.00 లక్షల జిల్లా పరిషత్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.2.08 కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులతో రెట్రోఫిట్టింగ్ క్రింద ఇంటింటికి కుళాయిలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రూ.30 లక్షల డీఎంఎఫ్ నిధులతో సీసీడ్రెయిన్లను నిర్మించామన్నారు. రూ. 3.60 లక్షలతో 2 గోకులం షెడ్లను, రూ.1.50 కోట్ల నాబార్డు నిధులతో కానూరు నుండి నడుపల్లి కోట వరకు రహదారి నిర్మించామన్నారు. అదే విధంగా రూ.4.34 కోట్ల శాస్కి నిధులతో కానూరు నుండి కోరుపల్లి వరకు, కానూరు నుండి ఏసులుమర్రుపాడు వరకు రహదారిని నిర్మిస్తామన్నారు. రూ.17.50 లక్షల ఎంపీలాడ్స్ నిధులతో జెడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్ ను నిర్మించామన్నారు. రూ.9 లక్షల నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో గ్రామంలో హెల్త్ సెంటర్ భవనం అభివృద్ధికి కృషి చేస్తున్నామని, రూ.13.81 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 36 మంది లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.




