తణుకు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వర రావు గారికీ రాబడిన సమాచారం మేరకు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బంది మరియు మద్యవర్తులుతో కలిసి మద్యాహ్నం సుమారు 12 గంటల సమయానికి తణుకు మండలం దువ్వు గ్రామంలో వయ్యేరు కాలువ పక్కన రజకుల సంఘం షెడ్డు వద్దకు వెళ్ళగా ముగ్గురు వ్యక్తులు అనగా
- వేగిరౌతు రామశివాజీ @ శివ, తండ్రి సత్యనారాయణ, వయసు 45 సంవత్సరాలు, కొబ్బరి చెట్టు వారి వీధి, వెంకటరాయపురం గ్రామం, తణుకు మండలం.
- గండికోట రాజు, తండ్రి సత్యనారాయణ, వయసు 42 సంవత్సరాలు, కడి వీధి రామాలయం దగ్గర, దువ్వ గ్రామం, తణుకు మండలం
- పోతిరెడ్డి సత్యనారాయణ, తండ్రి అప్పారావు 48 సంవత్సరాలు, అల్లపురం గ్రామం, పెంటపాడు మండలం
అనువార్లూ ఎటువంటి ప్రభుత్వ వారి అనుమతులు లేకుండా,అజాగ్రత్తగా,నిర్లక్ష్యంగా,అటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మందు గుండు సామాగ్రి తయారు చేస్తూ , ఇతరులకు అమ్మే ఉద్దేశ్య ముతో వాటిని నిల్వ చేసుకుంటూ ఉన్నందున వారి ముగ్గురును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుడి వివిద మందు గుండు సామాగ్రిని స్వాధీన పరచుకుని వారిపై పై సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినారు. ఎక్కడైనా ఇటువంటివి మీ చుట్టూ ప్రక్కల ఉన్న 9440796641 నెంబర్ కి తెలియపరచగలరు.



