రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు:మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు: చెడుపై మంచి సాధించిన విజయానికి, అధర్మంపై ధర్మం పొందిన గెలుపునకు ప్రతీక అయిన విజయదశమి (దసరా) పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… ” ఆ దుర్గాభవాని దివ్య ఆశీస్సులతో రాష్ట్రం సంక్షేమం, ప్రగతి పథంలో మరింత ముందుకు సాగాలి..రైతాంగం సస్యశ్యామలమైన పంటలతో వర్ధిల్లాలి..మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలి.. యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభించి వారి భవిష్యత్తు ఉజ్వలంగా మారాలి.. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలి.. ప్రతి ఇంట ఆనందాలు వెల్లివిరియాలని కనకదుర్గమ్మను ప్రార్థిస్తున్నాను.. మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ, ఈ పండుగను కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆశిస్తున్నాను” అన్నారు.. అదే విధంగా కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతాలను, ఆధ్యాత్మిక దివ్య క్షేత్రాలను, ప్రకృతి అందాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది, పర్యాటక రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన తెలుగు భాష, ప్రాచీన కళలు, జానపద సంస్కృతి, కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ, మన సంస్కృతీ సాంప్రదాయాల వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను చిత్ర పరిశ్రమకు అనుకూలమైన ప్రధాన వేదికగా మలచేందుకు, షూటింగ్లకు సరళమైన అనుమతులు, మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ టాలీవుడ్ పరిశ్రమ ఇక్కడ మరింత వికసించేలా చర్యలు వేగవంతం చేస్తున్నాం.ప్రత్యేకించి నిడదవోలును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం” అని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link