తణుకు పురుషుల శాఖ గ్రంధాలయంలో 80వ స్వతంత్రదినోత్సవ వేడుకలు

తణుకు బ్యాంక్ కాలనీ వద్ద ఉన్న పురుషుల శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయం అధ్యక్షురాలు అయిన శ్రీమతి వావిలాల సరళదేవి జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిగింది. అదేవిధంగా తణుకు అమృత వాణి ఈ ఎం స్కూల్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమాలలో మొదట గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జండా ఆవిష్కరణ చేయడం విద్యార్థినీ విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు జరిగినవి.
ఈ సందర్భంగా వావిలాల సరళదేవి మాట్లాడుతూ ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నాము అంటే 80 సంవత్సరాల క్రితం మన జాతీయ నాయకులు వారి రక్త తర్పణంతో మనకిచ్చిన స్వేచ్ఛ అనే పదమే ఈ స్వతంత్ర ఉద్యమ పండగ మరియు ముఖ్యంగా జెండా ఆవిష్కరణ, జెండా లోని రంగులు చక్రాల వల్ల అద్దాలను, స్వతంత్రం వచ్చిన విధానం జాతీయ నాయకుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరు తెలుసుకొని మీరు మంచి విలువలతో పెరిగి దేశభక్తిని చాటే విధంగా ఎక్కడ ఉన్నా నడుచుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో కౌర వెంకటేశ్వరరావు, వావిలాల వెంకట రమేష్, కె.వి.రాంకుమార్, చీకటి శ్రీనివాస్, లైబ్రరియన్ గుత్తికొండ కృష్ణారావు, రమేష్ గుప్తా, కే.శ్యామల, ఎన్. జ్యోతి స్కూలు అండ్ గ్రంథాలయం సభ్యులు పాల్గొనడం జరిగింది.

Scroll to Top
Share via
Copy link