జిల్లా కలెక్టర్ నుండి అత్యున్నత సేవా పురస్కారాలు పొందిన ఆర్టీసి ఉద్యోగులు

80 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్బంగా తణుకు డిపోలో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా అత్యున్నత సేవలoదిస్తున్న షేక్ లాల్ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రం ను జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ద్వారా అందుకున్నారని డిపో మేనేజర్ ADL సుధారాణి తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజా రవాణాధికారి గిరిదర్ కుమార్, జిల్లా కార్గో కమర్షియల్ మేనేజర్ GLPV సుబ్బారావు, డిపో మేనేజర్ సుధారాణి, డిపో సిబ్బంది, కార్గో సిబ్బంది లాల్ ని అభినందించారు. భీమవరంలోని జిల్లా ప్రజారవాణా అధికారి కార్యాలయంలో తణుకు డిపో ఆఫీస్ సూపరిండెంట్ కే జి ఎస్ ఎస్ శేఖర్, గ్యారేజ్ డిప్యూటీ సూపరిండెంట్ శ్రీనివాస్, గ్యారేజ్ లీడింగ్ హెడ్ చంద్రశేఖర్, అకౌంట్స్ సీనియర్ అసిస్టెంట్ నూకరాజు, ఏ డి సి ఆర్కే రావు, సీనియర్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ కళ్యాణ రాజు, ఎలక్ట్రీషియన్ సీతారాముడు, మెకానిక్ ఆర్ ఎస్ నారాయణ, డ్రైవర్లు బి డి రావు, ఎన్ ఎన్ రావు, కండక్టర్లు పి కృష్ణ, డి ఎస్ రావు, ఓడి కండక్టర్ పి ఎల్ ప్రసాద్ లకు జిల్లా ప్రజారవాణా అధికారి సప్తగిరి కుమార్ ప్రశంసా పత్రాలు అందించారని డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు. డిపోలో జరిగిన కార్యక్రమంలో కూడా అత్యున్నత సేవా ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించినట్లు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link