విద్యార్థులు సెల్ ఫోన్లు పట్ల జాగ్రత్తగా ఉండాలి

 ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా పైడిపర్రు సోషల్ వెల్ఫేర్ కాలేజీ బాయ్స్ హాస్టల్, యందు బుధవారం తణుకు న్యాయవాదులు, పోలీసు అధికారులు పిల్లలకు ర్యాగింగ్, డ్రగ్స్ మరియు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని, కొన్ని అసాంఘిక శక్తులు పిల్లల్ని పాడు చేయడం కోసం డ్రగ్స్ అమ్మకం, రవాణా చేయడం కోసం విద్యార్ధులను వాడుకుని వారి జీవితాలు నాశనం చేస్తున్నారని అన్నారు.  విద్యార్థులు ఒక్కసారి కేసులలో ఇరుక్కుంటే వారి జీవితం నాశనం అవుతుందని తెలిపారు. అలాగే సీనియర్ లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ అనే పేరుతో వేధించకూడదని అలా చేస్తే శిక్షార్హులని తెలుపుతూ, ప్రస్తుతం విద్యార్థులు సెల్ ఫోన్లు పట్ల జాగ్రతగా ఉండి దానిని మంచి కొరకు ఉపయోగించాలని సెల్ ఫోన్ మనిషిని మంచిగా వాడితే మంచి జరుగుతుంది, చెడు గా ఉపయోగిస్తే అది కొన్ని కేసులలో ఇరుకున పెడుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, దాని ద్వారా మంచి చెడు తెలుస్తుందన్నారు, ఒక్కసారి డ్రగ్స్ కేసులలో, ర్యాగింగ్ కేసులలో, సైబర్ క్రైమ్స్ లో ఇరుక్కుంటే జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు  కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, పైడి ధనుంజయరావు, తణుకు రూరల్ ఎస్.ఐ. ఎన్.వి.త్రిమూర్తులు, పారా లీగల్ వాలంటీర్  దూలపల్లి బ్రహ్మాజీ,  కాకర్ల నరసన్న, శ్రీమతి కె. నాగమల్లీశ్వరి, గంట అజర్, శ్రీమతి ఎం. శ్రీదేవి, హాస్టల్ వార్డెన్ జి. ఫణికుమార్ లు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link