తణుకు పట్టణంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తణుకు పట్టణంలో సుమారు 2,000 ఆటోలు, వాటికి అనుబంధంగా 11 ఆటో కార్మికుల యూనియన్లు పనిచేస్తున్నాయి.
ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న ఆటో కార్మిక సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలం, సాధించగలమనే సంకల్పంతోతణుకు పట్టణంలోని అన్ని ఆటో యూనియన్లను కలిపి “తణుకు టౌన్ ఆటో కార్మికుల యూనియన్” ఏర్పాటు చేయడం జరిగింది.
ఆటో కార్మికుల సమస్యలపై సమష్టిగా పోరాడుతూ, వారి హక్కుల సాధనకు కృషి చేయడంతో పాటు, కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి పరిరక్షణ, ప్రభుత్వ పథకాలు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి ఈ నూతన యూనియన్ కృషి చేయనుంది.
ఈ సందర్భంగా నూతన తణుకు టౌన్ ఆటో కార్మికుల యూనియన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షులు:
శ్రీ లాజర్ అబ్బదాసరి
గౌరవ అధ్యక్షులు:
శ్రీ పంగం రాంబాబు
ఉపాధ్యక్షులు:
శ్రీ కోటి కుమార్
ప్రధాన కార్యదర్శి:
శ్రీ కండెల్లి ప్రసాద్
కార్యదర్శి:
శ్రీ బి. శ్రీనివాస్
జా -కార్యదర్శి:
శ్రీ ఎస్. ప్రసాద్
కోశాధికారి:
అబ్బదాసరి సోలేమాన్
జా -కోశాధికారి:
గంగోలు శ్రీనివాస్
కమిటీ సభ్యులు
గంటి వెంకన్న, గోపి, దుర్గారావు, కె. వరప్రసాద్, వాసన శెట్టి రామ్
తదితర యూనియన్ ప్రతినిధులు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు లాజర్ అబ్బ దాసరి మాట్లాడుతూ “ఆటో కార్మికుల ఐక్యతే మా బలం. 11 యూనియన్లు, సుమారు 2,000 మంది ఆటో కార్మికులు ఒకే కుటుంబంగా ఐక్యంగా ముందుకు సాగితే మన సమస్యలను మనమే బలంగా పరిష్కరించుకోగలం. కార్మికుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా, ప్రతి ఆటో కార్మికుడి సమస్యను మా సమస్యగా భావించి పోరాడుతాం. తణుకు ఆటో కార్మికుల గౌరవం, హక్కులు, భవిష్యత్తు కోసం ఈ యూనియన్ నిరంతరం కృషి చేస్తుంది.”అని తెలిపారు.
“ఐక్యతతో అడుగు ముందుకు – ఆటో కార్మికుల హక్కుల సాధనే మా లక్ష్యం” అనే నినాదంతో నూతన కార్యవర్గం పనిచేస్తుందని నాయకులు తెలిపారు.




