పెరవలి బాపన్న కాలువలో స్నానానికిదిగిన వ్యక్తి గల్లంతు

పెరవలి మండలం ముక్కామల గ్రామంలో మంగళవారం ముగ్గురు స్నేహితులు బాపన్న కాలువలో దిగి స్నానం చేయుచుండగా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మునిగిపోవుచుండగా ఆ సమయంలో అక్కడే ఉన్న ముక్కామల గ్రామస్తుడైన బుచ్చి సతీష్ ఇద్దరు వ్యక్తులను కాపాడినట్లు మూడో వ్యక్తి మునిగిపోవుచు లోతుకి వెళ్లిపోవడంతో మూడో వ్యక్తిని కాపాడలేకపోయినట్లు సదరు మునిగిపోయిన వ్యక్తి గురించి మిగిలిన ఇద్దరు వ్యక్తులైన పెద్దిరెడ్డి శివప్రసాద్ పెట్ట నాగరాజును మునిగిపోయిన వ్యక్తి పేరు ఏడిద శ్రీ రవితేజ వయస్సు (40) కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవలి సబ్ ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్ కేసు నమోదు చేసి తహసిల్దార్ నిరంజన్ పర్య వేక్షణలో ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Scroll to Top
Share via
Copy link